Friday, September 20, 2024
Homeతెలంగాణప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి -

ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి –

ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి –

బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష

పెద్దపల్లి,అక్టోబర్06(కలం శ్రీ న్యూస్):బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి ఉష  సమక్షంలో పెద్దపల్లి స్వగృహం నందు శుక్రవారం కొలనూర్, పొత్కపల్లి, అబ్బిడిపల్లి, పెగడపల్లి, కదంబపూర్, పాలితం గ్రామాల నుండి 100 మందికి పైగా పెద్ద ఎత్తున  బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరికలు జరిగాయి. అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ నేడు వివిధ గ్రామాల నుండి మానవేని మల్లేశం ముదిరాజ్, సోగుల అనిల్ కుమార్, నక్కల రాజకొమురయ్య, జింకిరి కిరణ్, సుంచుల సుమంత్, మల్లవేని శంకర్ పోతనమైన రాజకుమార్, సుద్దాల శివకుమార్, జాన లక్ష్మణ్, అల్లడి సాగర్, తుంగాని రాధా సామ దివ్య, మాచర్ల సరోజన, మాచర్ల కవిత లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఒక బీఎస్పీకి మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల ఉపాధ్యక్షులు కొల్లూరి నర్సయ్య, ఆషాడపు రాములు, ఓదెల మండలం మహిళా కన్వీనర్ మేకల శోభ, రజిత, జింకిరి సంపత్ వార్డ్ మెంబర్, మల్లేశం ముదిరాజ్ సంఘం డైరెక్టర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!