మానవత్వం చాటుకున్న అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు.
సుల్తానాబాద్, అక్టోబర్ 06(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కూలి పని చేసుకుని జీవిస్తున్న కొత్తూరి శ్రీనివాస్ కుమారుడు యశ్వంత్ వరంగల్ ప్రతిమ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ రావడంతో, అక్కడ చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున, తాను సుల్తానాబాద్ పట్టణానికి చెందిన యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ ను సంప్రదించగా, పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు పదివేల రూపాయల ఆర్థిక సాయం, ప్రతి సంవత్సరం పదివేల రూపాయల చొప్పున తన చదువు అయిపోయినంతవరకు 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తండ్రి శ్రీనివాస్ మాట్లాడుతూ… మాది నిరుపేద కుటుంబం కావడం తో మా కుమారుడు చదువు కు సహాయం అందించిన ఈ దంపతులకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.