లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిభిరం
సుల్తానాబాద్, అక్టోబర్ 05(కలం శ్రీ న్యూస్ ) : సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అధ్వర్యంలో అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు కంటి చూపును మెరుగుపరచాలనే సదుద్దేశంతో మండలంలోని నారాయణపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం ఉదయం రేకుర్తి కంటి ఆసుపత్రి డాక్టర్లచే ఉచిత నేత్ర వైద్య శిభిరాన్ని గ్రామ సర్పంచ్ మూల స్వరూప-రాజేశం గౌడ్ ప్రారంబించారు.
ఇట్టి వైద్య శిబిరానికి పరిసర ప్రాంత గ్రామాల నుండి సుమారు 140 మందికి పైగా ప్రజలు కంటి పరీక్షలు చేయించుకోగా అందులో 25 మందికి ఉచితంగా మోతె బిందు (కంటి శుక్లాల) శస్త్రచికిత్స కొరకు రేకుర్తి లయన్స్ కంటి ఆసుపత్రికి బస్సులో పంపించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నోముల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి రాయల్ల నవీన్, తమ్మనవేని సతీష్, సర్పంచ్ మూల స్వరూప-రాజేశం గౌడ్, ఎంపీటీసీ మండల రమేష్, ఉపసర్పంచ్ ఎర్రవెల్లి రామారావు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
.