క్రీడాకారులకు అండగా బొద్దుల…
నేషనల్ లెవెల్ సీనియర్ డాడ్జ్ బాల్ పోటీకి వెళ్తున్న అభ్యర్తుని ప్రయాణానికి ఆర్థిక సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్.
పెద్దపల్లి,అక్టోబర్05(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 8 వ వార్డు కి చెందిన మొహమ్మద్ అమీర్ ఖాన్ సీనియర్ డాడ్జ్ బాల్ పోటీలో నేషనల్ లెవెల్ కి ఎన్నుకోబడినారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఈ నెల 25 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు జరగనున్న నేషనల్ లెవెల్ పోటీకి వెళ్ళడానికి ప్రయాణ సౌకర్యాల కొరకు ఆర్థిక సహాయం అందించాలని అమీర్ కెసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ని కోరగా వెంటనే స్పందించి స్థానిక కెసిఆర్ సేవా దళం నాయకుల ద్వారా అమీర్ కి ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఇట్టి సహాయం అందించిన యువ నాయకులు బొద్దుల లక్ష్మణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన అమీర్ ఖాన్, వారి కుటుంబ సభ్యులు.
ఈ కార్యక్రమంలో కెసిఆర్ సేవా దళం పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు షేక్ షకీల్, నాయకులు శ్రీనివాస్, మొహమ్మద్ రఫీక్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.