లారీ డ్రైవర్స్ కి జీవిత భీమా అందజేసిన నల్ల
సుల్తానాబాద్, అక్టోబర్ 04(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండల లారీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు 120 మందికి పూసాల లోని ముదిరాజ్ కల్యాణ మండలం లో జీవిత భీమా కార్డులు పంపిణి చేసిన పెద్దపల్లి యంగ్ & డైనమిక్ లీడర్ నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి.
ఈ సందర్బంగా నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్స్ ప్రతి రోజు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటారు. నేటి సమాజం లో జరగరాని సంఘటనలు చాలా జరుగుతున్నాయనీ, డ్రైవర్స్ ప్రయాణం లో మద్యం సేవించకూడదనీ, ఒక డ్రైవర్ పైన వారి కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుందని, చాలా మంది డ్రైవర్స్ కుటుంబాలు రోడ్డున పడుతున్న, వారికి వారి కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వారి జీవితాలలో వెలుగు నింపాలని 5 లక్షల జీవిత భీమా నేను ఉన్నన్ని రోజులు అందిస్తానని, సుల్తానాబాద్ మండల లారీ అసోసియేషన్ డ్రైవర్స్ ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా ఆ దేవుడు చల్లగా చూడాలని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా సుల్తానాబాద్ మండల లారీ అసోసియేషన్ సభ్యులు వారికి జీవిత భీమా కల్పించి అండగా నిలిచిన నల్ల మనోహర్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నల్ల కి సర్వదా రుణపడి ఉంటామని తెలియజేసారు
ఈ కార్యక్రమం లో సుల్తానాబాద్ మండల లారీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.