బహుజనులు అంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది
బీఎస్పీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష
పెద్దపల్లి,అక్టోబర్04(కలం శ్రీ న్యూస్):బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి ఉష సమక్షంలో పెద్దపల్లి స్వగృహం నందు పెద్దపల్లి అసెంబ్లీ కో కన్వీనర్ దేశబోయిన అఖిల, మహేష్, మాజీ ఎంపీటీసీ పాటాకుల మహేందర్ ఆధ్వర్యంలో జూలపల్లి మండల కేంద్రం నుండి మాజీ వార్డ్ మెంబర్లు సత్యనారాయణ సింగ్, కుమ్మరి రమేష్, గుంటి సదయ్య , పెద్దల పద్మ , గుంటి వనిత, చుక్క రామ తదితరులకు దాసరి ఉష పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ జుల్లపల్లి మండల కేంద్రం నుండి నేడు వివిధ పార్టీల నుండి మాజీ వార్డ్ మెంబర్లు బహుజన్ సమాజ్ పార్టీలోకి చేరినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.బహుజనులంతా ఏకమై రానున్న ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతో ఉందని, రానున్న రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న రైతన్నల సంతోషం కోసం బహుజనులు అంతా కలిసి ముందడుగు వేస్తేనే బహుజన రాజ్యాధికారం సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం దాసరి ఉష బీఎస్పి పెద్దపెల్లి అభ్యర్థి అయిన సందర్భంగా పలువురు నాయకులు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పి పెద్దపల్లి అసెంబ్లీ కో కన్వీనర్ దేశబోయిన అఖిల, జుల్లపళ్లి మండల అధ్యక్షులు సిపెల్లి కొమురయ్య, మండల ప్రధాన కార్యదర్శి కత్తర్ల లక్ష్మణ్, మండల కోశాధికారి చిన్న మల్లేశం,బీఎస్పీ నాయకులు గోలి శ్రీనివాస్, మహేష్, పాటాకుల మహేందర్, అమీర్శెట్టి రాజిరెడ్డి, రాజేశం సంపత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.