మేముసైతం నల్ల వెంట అంటున్న పెద్దకల్వల ఎస్సీ కాలనీ గ్రామ ప్రజలు
పెద్దపల్లి,అక్టోబర్04(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి మండలం పెద్దకల్వల (ఎస్సీ కాలని) గ్రామ ప్రజలు ఇటీవల బి అర్ ఎస్ పార్టీ టికెట్ వ్యవహారం లో అసంతృప్తి గా ఉన్న నల్ల మనోహర్ రెడ్డి ని గ్రామానికి స్వచ్ఛందంగా డప్పు సప్పులతో, బాణ సంచాలతో, మంగళహారతులతో ఘన స్వాగతం పలికి రాబోయే ఎన్నికల్లో నల్ల మనోహర్ రెడ్డి బరిలో ఉండాలని తను ఏ పార్టీ నుండి పోటీ చేసిన తామంత నల్ల వెంటే ఉండి భారీ మెజారిటీ తో గెలిపించుకుంటామంటూ హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దకల్వల ఎస్సీ కాలని గ్రామ ప్రజల లో ఉన్న చైతన్యానికి తను సర్వదా రుణపడి ఉంటానని, తప్పకుండ రాబోయే రోజుల్లో మీ అందరి సహాయ సహకారల తో ఎన్నికల బరిలో ఉంటానని, మీకు ఎలాంటి కష్టం వచ్చిన ఆపద వచ్చిన చేదోడు వాదోడుగా ఉంటానని, రాబోయే రోజుల్లో ప్రజలు మంచికి ఓటు వేయాలని మీరు నాకు ఇచ్చే స్ఫూర్తి, భరోసా వృధా కాకుండా ఒక మంచి వ్యవహార శైలి తో 24 గంటలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు పోతానని, అలాగే మిగితా నాయకులు ఒక ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్ల స్వార్థ రాజకీయల కోసం ఓట్ల అడగడానికి మాత్రమే వస్తారని, రాబోయే ఎన్నికల్లో మీరంతా కూడా మంచికి ఓటు వేసి వారందరికీ తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ 24 గంటలు నిత్యం ప్రజల లో ఉంటూ ప్రజా సేవ చేస్తూ ఆపద సమయంలో అన్ని విధాలుగా ఆదుకుంటున్న నల్ల మనోహర్ రెడ్డి కి మా సంపూర్ణ మద్దతు తెలుపుతూ మేమంతా తన వెంటే ఉండి తనని అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.