క్రీడలతో మానసిక ఉల్లాసం..
సుల్తానాబాద్,అక్టోబర్ 4 (కలం శ్రీ న్యూస్ ) :క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఇండియన్ పబ్లిక్ పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ అన్నారు.
మండల కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో మంగళవారం జరిగిన జోనల్ స్థాయి క్రీడల్లో నాలుగు మండలాలు పాల్గొనగా సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ కనబర్చి సత్తా చాటారు. మండల ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో అండర్- 17 బాలికలు మొదటి బహుమతి, అండర్-17 బాలురు రెండవ బహుమతి, అండర్-14 బాలురు రెండవ బహుమతి సాధించగా సాధించారు. అలాగే ఖో- ఖో పోటీలలో అండర్-14 ఇయర్స్ బాలికలు మొదటి బహుమతి గెలుపొందగా అండర్-14 ఇయర్స్ బాలురు మొదటి బహుమతి గెలుపొందారు. వీరిని పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపాల్ కృష్ణ ప్రియా విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలలో ఆసక్తి కనబ రిచి రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, ఇక్బాల్, శివ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.