బన్నె చెరువులో యువకుని గల్లంతు..
గాలింపు చర్యలను పర్యవేక్షించిన పుట్ట శైలజ.
మంథని,అక్టోబర్03(కలం శ్రీ న్యూస్):మంథని మున్సిపల్ పరిధిలోని బన్నే చెరువులో బోయినీ పేటకు చెందిన ఆకుల భవాని అనే యువకుడు గల్లంతయ్యాడు. ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ హుటాహుటిన అక్కడకు చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించి యువకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.