స్వల్ప అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని, అక్టోబర్ 3 (కలం శ్రీ న్యూస్):మంథని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రజా ఆశీర్వాద పాద యాత్రలో భాగంగా మంగళవారం రామగిరి మండలంలో బేగంపేట ఎక్స్ రోడ్ వద్ద పాదయాత్ర చేపడుతున్న క్రమంలో ఒకసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు హుటాహుటిన అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా వైద్య సిబ్బంది అంబులెన్స్ లోనే వైద్య సేవలు అందించారు. గత నెల 25న ముత్తారం మండలంలో ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభించగా ముత్తారం మల్హర్,మహాదేవపూర్ మహా ముత్తారం, మంథని మీదుగా రామగిరి మండలంలో కొనసాగుతుంది. గతంలో మహా ముత్తారం, మంథని మండలాల్లో స్వల్ప అస్వస్థతకు గురికాగా వైద్య సేవలు పొందగా తాత్కాలిక ఉపశమనం లభించడంతో తిరిగి పాదయాత్రను కొనసాగిస్తున్నారు.