క్రీడలకు పుట్టినిల్లు సుల్తానాబాద్
డివైస్ ఓ ఏ సురేష్
సుల్తానాబాద్,అక్టోబర్ 3 (కలం శ్రీ న్యూస్ ): జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్ది,ఎంతో మంది క్రీడా కారులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రోత్సహిస్తూ క్రీడలకు పుట్టినిల్లుగా సుల్తానాబాద్ మారిందని పెద్దపల్లి డివైఎస్ఓ ఏ సురేష్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ కొమరోజు శ్రీనివాస్ ట్రాస్మా జిల్లా సెక్రెటరీ బుచ్చిరెడ్డి, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, ఐపీఎస్ పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్ అన్నారు. హెచ్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో నిర్వహిస్తున్న 67వ ఎస్ జి ఎఫ్ కబడ్డీ, కోకో పోటీలను మంగళవారం వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే క్రీడారంగంలో సుల్తానాబాద్ ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఎన్నో రాష్ట్రస్థాయి పోటీలను సీనియర్ క్రీడాకారుల సహకారంతో విజయవంతంగా నిర్వహించిన ఘనత సుల్తానాబాద్ కు దక్కిందన్నారు. పోటీల విజయవంతానికి సహక రిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోటీల్లో 4 మండలాల నుంచి 350 మంది క్రీడాకారులు, 50 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారని, వీరికి భోజన వసతులు కల్పించిన ఇండియన్ పబ్లిక్ పాఠశాల యజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడాపతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడాకారులు ప్రతిజ్ఞ చేశారు.సాయంత్రం ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో కే జి ఎఫ్ జోనల్ కన్వీనర్ సంధ్యారాణి, మండల కన్వీనర్ దాసరి రమేష్, అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు గెల్లు మధూకర్, వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, శివ, ఇక్బాల్, సంపత్, క్రీడాకారులు పాల్గొన్నారు.