Friday, September 20, 2024
Homeతెలంగాణఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరు...పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరు…పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరు…పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ఎలిగేడు,అక్టోబర్03(కలం శ్రీ న్యూస్):ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా ఎన్ని అసత్యపు ప్రచారాలు చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని  పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి  తెలియజేశారు. మంగళవారం నియోజకవర్గంలోని ఎలిగేడు మండలం లోకపేట, ముప్పిరి తోట గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి గత తొమ్మిదిన్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆరు గ్యారెంటీ స్కీములని కాంగ్రెస్ ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తున్నా వారు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్,బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతు బీమా, బీసీ బందు, మైనార్టీ బందు, దళిత బంధు, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు లాంటి ఒక్క పథకం కూడా ఎందుకు అమలు చేయడం లేదన్నారు. మొండి చేతికి ఓటు వేస్తే తిరిగి కరెంటు, నీటి కష్టాలు వస్తాయన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కేటీఆర్  సభకు వచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయింది అన్నారు. మరోసారి ఓటమి తప్పదని బెంగ పట్టుకుందని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం లో ఏమి అభివృద్ధి చేశారన్నారు. రెండేళ్ల పాటు కరోనా విపత్కర పరిస్థితులు ఉన్నా నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామన్నారు. సీఎం కేసీఆర్ దార్షనికతతో పెద్దపల్లి జిల్లా అయిందన్నారు. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్  ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, పెద్దపల్లిలో కూడా ప్రజలు గులాబీ పార్టీ వైపే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, జడ్పీ వైస్ చైర్ పర్సన్ మండిగ రేణుక రాజనర్సు, మండల పార్టీ అధ్యక్షులు బైరెడ్డి రాంరెడ్డి, PACS ఛైర్మెన్ లు మోహన్ రావు,విజయ భాస్కర్ రెడ్డి,రైతు సమితి మండల కో ఆర్డినేటర్ సుధాకర్ రావు,సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మాడ కొండాల్ రెడ్డి, సర్పంచ్ లు వేణు, ఐలయ్య, ఎంపీటీసీ నారగోని ఎల్లమ్మ,మాజీ సర్పంచ్ లు ప్రసాద రావు, వెంకటయ్య, ఉప సర్పంచ్ లు మల్లేశం, చీకటి శైలజ -సంతోష్ ,గ్రామ శాఖ అధ్యక్షులు తిరుమలేష్, లక్ష్మణ్,రైతు సమితి కో ఆర్డినేటర్ నారగోని రాములు, లక్ష్మణ్ రావు, నాయకులు ముత్యం లచ్చయ్య లతో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!