మంథనిలో గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టుల నిరసన
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని, అక్టోబర్ 2(కలం శ్రీ న్యూస్) : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన పిలుపులో భాగంగా సోమవారం మంథనిలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి మంథని పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం గాంధీ విగ్రహానికి పలు డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ దేశంలో మీడియాతో పాటు అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని, దేశంలో విభిన్న రంగాలకు చెందిన వారితో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని,అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాసులను పునరుద్ధరించాలని, జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు పోతరాజు సమ్మయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కొమురోజు చంద్రమోహన్,జిల్లా కోశాధికారి పెండ్యాల రామ్ కుమార్ , సీనియర్ పాత్రికేయులు కొమురోజు మారుతి, మహావది సతీష్, తగరం రాజు, రావుల తిరుమల్, లక్కాకుల నాగరాజు, మాటేటి కుమార్, లింగాల సురేష్, కేసారపు రవి, బండారు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.