Tuesday, December 3, 2024
Homeతెలంగాణహస్తం వీడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు

హస్తం వీడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు

హస్తం వీడుతున్న సీనియర్ నేతలు

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 29 ( కలం శ్రీ న్యూస్):40ఏండ్ల కుటుంబ పాలనలో విస్తరించుకున్న దుద్దిళ్ల సామ్రాజ్యకోట బీటలు వాడుతోంది.ఎన్నో ఏండ్లు కాంగ్రస్ పార్టీలో కీలక పాత్ర పోషించడంతో పాటు దుద్దిళ్ల అనుచరులుగా పేరు పొందిన సీనియర్ నాయకులు హస్తం వీడి కారు ఎక్కుతున్నారు. ఇటీవలి కాలంలో మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు,నాయకులు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్లోకి చేరుతున్నారు. గత వారం రోజుల క్రితం మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెగ్గెం రాజేష్ తన అనుచరులతో కలిసి జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే మహదేవ్ పూర్, ముత్తారం మండలాలకు చెందిన పలువురు సైతం కాంగ్రెస్ ను వీడి గులాబీదళం లో చేరిపోయారు. తాజాగా మంథని మండలం ఎగ్లాస్ పూర్ మాజీ సర్పంచ్ జంజర్ల పల్లవి శేఖర్ బీఆర్ఎస్ లో చేరారు.మహాముత్తారం మండలం కనుకునూర్ లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద పాదయాత్రలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ జంజర్ల దంపతులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.సెగ్గెం రాజేష్, జంజర్ల శేఖర్ లాంటి సీనియర్నాయకులు బీఆర్ఎస్ పార్టీలోచేరుతున్న క్రమంలో మంథని కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పకనే చెప్పచ్చు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృధ్ది, సంక్షేమ పథకాల అమలుతోపాటు జిల్లా పరిషత్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధూకర్ చేస్తున్న అభివృద్ది సేవలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు జంజర్ల దంపతులు తెలిపారు. పుట్ట మధూకర్ కు అండగా నిలుస్తూ ఆయన వెంట నడుస్తూ గెలుపు కోసం కష్టపడుతామని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!