ఘనంగా వినాయకుని నిమజ్జనం
సుల్తానాబాద్,సెప్టెంబర్ 27 (కలం శ్రీ న్యూస్ ): సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో వినాయకుడి విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పాఠశాలలొ తొమ్మిది రోజుల పాటు గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి,బుధవారం పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపాల్ కృష్ణప్రియ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలో విఘ్నేశ్వరుడిని ట్రాక్టర్ పై ప్రత్యేకంగా అలంకరించి మేళ తాళాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు నృత్యాలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. సమీప పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.