ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు పల్లా శ్రీనివాస్
సుల్తానాబాద్, సెప్టెంబర్ 27(కలం శ్రీ న్యూస్):ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్నిసార్లు విన్నవించిన స్పందించకపోవడం బాధాకరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కమిటీ పిలుపుమేరకు ఈనెల 30న చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగిందని కావున ప్రతి వైశ్యుడు తప్పకుండా అందరూ పాల్గొనాలని కోరుతున్నాను.