కార్మికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్
సుల్తానాబాద్, సెప్టెంబర్ 27(కలం శ్రీ న్యూస్):మున్సిపల్ కార్మికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెదలాలని మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నిత్యం పారిశుద్ధ్య పనులలో బిజీగా ఉండే కార్మికులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎలాంటి రుగ్మతలు దరిచేరకుండా చూసుకోవాలని అన్నారు. నిత్యం వ్యర్థ పదార్థాలను తొలగించే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకొని పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం వైద్యులు కార్మికులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్, డాక్టర్ మహేందర్, మంజు చౌదరి, స్టాఫ్ నర్స్ ప్రభాకర్, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటాచారి తో పాటు పలువు పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ మల్లికార్జున్ ఫ్రీడమ్ ఫైటర్ల డే లో భాగముగా సిబ్బందితో కలసి స్థానిక నెహ్రూ విగ్రహం వద్ద స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహించారు.