కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్ పర్సన్ ముత్యం సునీత
సుల్తానాబాద్, సెప్టెంబర్ 27(కలం శ్రీ న్యూస్): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను బుదవారం మున్సిపల్ కార్యాలయం లో ఘనంగా నిర్వహించనైనది. ఈ సందర్బంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ దేశసేవకు అంకితమైన ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. అనంతరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,ఆయన సేవలను స్మరించుకొన్నారు.
ఈ కార్యక్రమం లో కమీషనర్ టి. మల్లికార్జున్, కౌన్సిలర్ మమత సంపత్, మేనేజర్ అలిమోద్దీన్, వార్డ్ ఆఫీసర్లు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.