తెలంగాణ ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ
బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 27 (కలం శ్రీ న్యూస్): మంథని బీజేపీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన నాయకులు.స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం,ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ అని సునీల్ రెడ్డి కొనియాడారు.దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన వేల ఆ స్వప్నాన్ని మాత్రం ఆయన చూడలేక పోయారని ఉద్యమాలతోపాటు ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం తపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబరు 27న జన్మించిన కొండ లక్ష్మణ్ బాపూజీ. నాడు నిరంకుశ నిజాం రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1947 నుండి 1948 మధ్యకాలంలో జరిగిన తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి,జిల్లా అధికార ప్రతినిధి పోతన వేణి క్రాంతి, అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్,మంథని మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, రామగిరి మండల ఇన్చార్జి ఎడ్ల సదాశివ్,రేపాక శంకర్,ఆరె ఓదెలు, చిదురాల మధుకర్ రెడ్డి,పార్వతి విష్ణు తదితరులు పాల్గొన్నారు.