ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల వేతనాలు చెల్లించాలి
బూడిద గణేష్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 27 (కలం శ్రీ న్యూస్):మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు,సెక్యూరిటీ గార్డు లకు ఐదు నెలల వేతనాలు చెల్లించాలని ఆస్పత్రి ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించి హాస్పిటల్ సూపరిండెంట్ కంది శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు సెక్యూరిటీ గార్డులకు గత ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలను ఏలా పోషించుకుంటారని ప్రశ్నించారు.పండగపూట కార్మికులు అర్ధాకలితో అలమటిస్తూ విధులకు హాజరవుతూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నెల నెల వేతనాలు అందకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతూ వారి యొక్క కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. 5 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. బంగారు తెలంగాణలో పారిశుద్ధ కార్మికులు బజారున పడే పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారం రోజుల్లోగా వేతనాలు అందకుంటే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓదమ్మ,పద్మ, ప్రమీల,లక్ష్మి ,శ్రీకాంత్,చంద్రయ్య, శ్రావణ్, శ్రీను, అనసూయ, తదితరులు పాల్గొన్నారు.