అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 26 (కలం శ్రీ న్యూస్):వీర నారీ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను మంథని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అధికారికంగా మంగళవారం నిర్వహించారు. మంథని ఆర్డీవో హనుమ నాయక్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను అధికారకంగా తాము నిర్వహించడం పట్ల ఆర్డీవో హనుమ నాయక్ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డీఏఓ తూము రవీందర్,రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.