చాకలి ఐలమ్మ స్పూర్తితో బహుజనుల్లో చైతన్యం నింపుతున్న “పుట్ట” దంపతులు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 26 ( కలం శ్రీ న్యూస్):వీరనారి చాకలి ఐలమ్మ ఆత్మగౌరపోరాట స్ఫూర్తితో ఐలమ్మ పోరాట స్ఫూర్తితో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు,మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజలు సైతం అంతే నియోజకవర్గం బడుగు,బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి కృషి చేస్తున్నారని మంథని ఎంపీపీ కొండ శంకర్, జెడ్పిటిసి తగరం సుమలత-శంకర్ లాల్,మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. చాకలి ఐలమ్మ 128వ జయంతి పురస్కరించుకొని స్థానిక ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తాము కూడా ప్రజాసేవ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాయితీ సమ్మయ్య,బీఆర్ఎస్ నాయకులు వేల్పుల గట్టయ్య, గొబ్బూరి వంశీ, ఆసిఫ్, ఖలీల్, ఇర్ఫాన్, బెజ్జంకి దిగంబర్, రజక సంఘం నాయకులు కొల్లూరి రాజయ్య,సమ్మయ్య,పోతరాజు శ్రీనివాస్, కొండపర్తి శంకర్ లు పాల్గొన్నారు.