Sunday, December 10, 2023
Homeతెలంగాణమంథని గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు

మంథని గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు

మంథని గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్

మంథని సెప్టెంబర్ 26( కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలో మంగళవారం గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షురాలుగా పుట్ట శైలజ, కమిటీ అధ్యక్షులుగా మిరాల సాగర్ యాదవ్,ఉపాధ్యక్షులుగా కొత్త శ్రీనివాస్ గుప్తా, బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రామడుగు మారుతి రావు, కార్యదర్శిగా ఇల్లందుల కిషోర్, సహాయ కార్యదర్శిగా రేపాల ఉమాదేవి, కోశాధికారిగా పోతరవేని క్రాంతి కుమార్, సహాయ కోశాధికారిగా మొదుగులపల్లి విజయ్ కుమార్, గౌరవ సలహాదారుగా మెడగొనీ రాజమౌళి గౌడ్, కార్యవర్గ సభ్యులుగా రాచకొండ నరేష్, నామని నగేష్, పందుల వివేక్, బడికెల రాజశేఖర్, ఎడ్ల శివ లను ఎన్నుకోవడం జరిగింది.అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మంథని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంథని ఎంపిపి కొండా శంకర్, మున్సిపల్ కమిషనర్ సతీష్, ఎస్సై కిరణ్ కుమార్, ఎక్సైజ్ సిఐ గురవయ్య, ఫైర్ డిపార్ట్మెంట్ సదానందం లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గణేష్ ఉత్సవ కమిటీకి తమ సహకారం అందిస్తామని హామీ ఇచ్చి, సభ్యులకు శాలువా కప్పి, సన్మానం చేసి,శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గణేష్ మండప సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!