గణేష్ నగర్ వినాయక మండపం వద్ద సాముహిక కుంకుమార్చన
సుల్తానాబాద్, సెప్టెంబర్ 26(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణంలోని గణేశ్ నగర్ కాలనీ వినాయక మండపం వద్ద గణపతి నవరాత్రుల సందర్బంగా 8వ రోజు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహిళలచే అత్యంత భక్తిశ్రద్ధలతో పురోహితులు గూడ రమేష్ శర్మ వేద పారాయణం చేస్తూ సహస్ర కుంకుమార్చనలు, అమ్మవారికి సాముహిక కుంకుమ పూజాధికాలు నిర్వహించారు. అనంతరం లయన్స్ క్లబ్ వారిచే దీకొండ భుమేశ్ కుమార్, కట్ల సంపత్, ఆడేపు పాండురంగలు 450 మంది భక్తులకు అన్నవితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాటేటి శ్రీనివాస్, గుర్రాల శంకరయ్య, నోముల శ్రీనివాస్ రెడ్డి, నల్ల శ్రీనివాస్, జూలూరి అశోక్, రాయెళ్ల నవీన్, రాజు, అశోక్, హరికిషన్, రఘు, సమ్మయ్య, వెంకటేశం, రమేష్, సంపత్, క్రిష్ణ, యాదగిరి, చొక్కయ్య, రామారావు, ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.