Saturday, July 27, 2024
Homeతెలంగాణఘనంగా చాకలి ఐలమ్మ  128 వ జయంతి వేడుకలు

ఘనంగా చాకలి ఐలమ్మ  128 వ జయంతి వేడుకలు

ఘనంగా చాకలి ఐలమ్మ  128 వ జయంతి వేడుకలు

సుల్తానాబాద్, సెప్టెంబర్ 26 (కలం శ్రీ న్యూస్): తెలంగాణ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పలువురు మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల(చాకలి) ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని ధైర్య సాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆమె సేవలను స్మరించారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు నిట్టూరి శ్రీనివాస్,పట్టణాధ్యక్షులు నిట్టూరి మైసయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నిట్టూరి ఆనంద్, మండల వైస్ ప్రెసిడెండ్ నిట్టూరి రాజేశం,ప్రధాన కార్యదర్శి నిట్టూరి దీపక్, గౌరవాధ్యక్షులు మైలారం మదురయ్య, వైస్ ప్రెసిడెంట్ నిట్టూరి అంజయ్య, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్, కమిటీ మెంబెర్స్ తోటపల్లి సంతోష్, చాతల శివ,నిట్టూరి కృష్ణ,నిట్టూరి ఓదెలు,నిట్టూరి శంకర్, నిట్టూరి సతీష్, నిట్టూరి శ్రీనివాస్, పూసాల స్వామి,నిట్టూరి గణేష్, నిట్టూరి స్వామి, నిట్టూరి సందీప్, కొత్తకొండ అభి, నిట్టూరి. శ్రీనివాస.తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!