నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత
సుల్తానాబాద్, సెప్టెంబర్ 26(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణ పరిధిలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ అన్నారు.మంగళవారం ఉదయం వారు ఏ.సి.పి ఎడ్ల మహేష్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తో కలిసి సుల్తానాబాద్ పెద్ద చెరువు వద్ద వినాయక ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం లో ఎటువంటి గొడవలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిమజ్జనం లో పాల్గొని విజయవంతం చేయాలని పట్టణ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు సిఐ జగదీష్, ఎస్సై విజయేందర్, కో ఆప్షన్ సభ్యులు సాజిద్, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.