Wednesday, September 18, 2024
Homeతెలంగాణలయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిభిరం 

లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిభిరం 

లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిభిరం 

సుల్తానాబాద్, సెప్టెంబర్ 25(కలం శ్రీ న్యూస్):లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ అధ్వర్యంలో సుల్తానాబాద్ మండల పరిధిలోని గర్రెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం ఉదయం రేకుర్తి కంటి ఆసుపత్రి డాక్టర్లచే ఉచిత నేత్ర వైద్య శిభిరాన్ని మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షురాలు వీరగోని సుజాతా-రమేష్ గౌడ్ ప్రారభించారు. ఇట్టి పరీక్షలకు చుట్టు ప్రక్కల 9 గ్రామాల నుండి సుమారు 150 మందికి పైగా ప్రజలు కంటి పరీక్షలు చేయించుకోగా అందులో 40 మందికి ఉచితంగా కంటి శుక్లాల శస్త్రచికిత్స నిమిత్తం రేకుర్తి లయన్స్ కంటి ఆసుపత్రికి బస్సులో పంపించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నోముల శ్రీనివాస్ రెడ్డి, దీకొండ భూమేష్ కుమార్, పోచంపల్లి పోచమల్లు, కొమురవెల్లి చక్రధర్ సర్పంచ్ వీరగోని సుజాతా-రమేష్ గౌడ్, ఎంపీటీసీ పులి అనూష, సెక్రటరీ ప్రశాంత్ సందీప్ ఉపసర్పంచ్ మధు, వార్డు సభ్యులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!