లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 400 మంది గణపతి భక్తులకు అన్న వితరణ
సుల్తానాబాద్, సెప్టెంబర్ 25(కలం శ్రీ న్యూస్): లయన్స్ క్లబ్ అఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కాలనీ వినాయక మండపం వద్ద అత్యంత భక్తి శ్రద్దలతో గణనాదుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం 400 మంది భక్తులు, ప్రజలకు జిల్లా కో ఆర్డినేటర్ లయన్ జూలూరి అశోక్, క్లబ్ అధ్యక్షులు లయన్ నోముల శ్రీనివాస్ రెడ్డి అన్నవితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ లయన్ మాటేటి శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షులు నోముల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్ జూలూరి అశోక్, దీకొండ భూమేష్ కుమార్, పిట్టల వెంకటేష్, కట్ల సంపత్, పోచంపల్లి పోచమల్లు, ఆడేపు పాండురంగ, బాదం క్రిష్ణమూర్తి, ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు భక్తులు, అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.