Wednesday, September 18, 2024
Homeతెలంగాణమేం సేవలు చేసినం...అభివృధ్ది చేసి చూపించినం

మేం సేవలు చేసినం…అభివృధ్ది చేసి చూపించినం

మేం సేవలు చేసినం…అభివృధ్ది చేసి చూపించినం

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్

 మంథని సెప్టెంబర్ 24 (కలం శ్రీ న్యూస్):40 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేయనోళ్లు మళ్లా ఓట్ల కోసం వస్తున్నారని, ఇన్నేండ్లు ఏం చేయనోళ్లు మళ్లా ఏం చేస్తరని నిలదీయాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం మంథని పట్టణంలోని ఎస్‌ఎల్బీ గార్డెన్‌లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవలు పొందిన వారితో ఏర్పాటు చేసిన మీ సేవ మా అదృష్టం కార్యక్రమంలో మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక సంవత్సరాలు ఒకే కుటుంబం నియోజకవర్గాన్ని పరిపాలన చేసి మన గురించి ఆలోచన చేయలేదని ఆయన అన్నారు. ఈనాడు ఎమ్మెల్యేగా ఉంటూ రూ.2.75లక్షల జీతం తీసుకుంటూ ఏ ఒక్కరికి రూపాయి సాయం చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. మన ఓట్లతో గెలిచి ఆస్తులు కూడబెట్టుకుని అమెరికాలో అనందంగా ఉంటున్నారే తప్ప ఏనాడు మన ఆకలి తీర్చాలని ఆలోచన చేయలేదని ఆయన విమర్శించారు. ఆనాడు మన గురించి ఆలోచన చేసి అన్నం పెట్టి ఉంటే ఈనాడు ఆకలి ఎందుకు ఉండేదన్నారు.ఎన్నికలు సమీపిస్తుండటంతో పేద ప్రజలపై కపట ప్రేమ కురిపిస్తున్నారని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని,ఎస్సీలకు భూములు ఇచ్చామని,రుణాలు ఇచ్చామని ప్రచారం చేస్తున్నారని,ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఉంటే ఇంకా పేదలు పూరి గుడిసెల్లో ఎందుకు ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఎస్సీలకు భూములు రుణాలు ఇచ్చి ఉంటే వాళ్ల బ్యాంకు ఖాతాల్లో రూపాయి నిల్వ ఎందుకు లేదన్నారు. కేవలం మాయమాటలు అబద్దాలతో అధికారంలోకి రావాలనే ఆలోచనలు తప్ప మన గురించి పట్టించుకోరన్నారు. ఏమీ చేయకున్నా మళ్లీ ఓట్లకు వస్తున్నారంటే మనం నిలదీస్తమనే భయం వాళ్లలో లేదని, ప్రజలకు ఏదీ చెప్పినా నమ్ముతారని అహంకారపూరితమైన నమ్మకం వారిలో ఉందన్నారు. ఈనాడు కాంగ్రెస్‌ మానిఫేస్టోలో ఫించన్‌ను పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారని, అనేక ఏండ్లు అధికారంలో ఉండి కేవలం రూ.200ల పించన్‌ వచ్చిన వాళ్లు కనీసం రూ.201 పెంచలేదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి రూ.2016 పించన్‌ ఇస్తుంటే కాంగ్రెస్సోళ్లు ఆనాడు రూపాయి పెంచకుండా ఈనాడు వేలకు వేలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆనాడు పేదబిడ్డగా తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే అనేక సేవలు అందించామని, మంథని ప్రాంత అభివృధ్దికి నిరంతం కృషిచేశామన్నారు. పేద బిడ్డల పెండ్లిళ్ల, కళాశాలల్లో మధ్యాహ్న బోజనం, పిల్లల చదువులకు సాయం, ఆస్పత్రుల్లో మంచి వైద్యం అందించామని ఆయన తెలిపారు. అయితే తాము చేస్తున్న సేవలను ఓర్వలేక నోట్ల సంచులతో వచ్చి ప్రజలను మభ్యపెట్టి తనకు దూరం చేశారని, తాను ఇన్ని చేసినా ప్రజలు ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తున్న క్రమంలో మళ్లీ ప్రజలకు దూరం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని, తొమ్మిదేండ్ల కాలంలో అనేక అబద్దాలు, కుట్రలు కుతంత్రాలతో బదనాం చేశారని, వాళ్లు ఆరోపించిన ఏ ఒక్కరి నిరూపన కాలేదన్నారు. ఇలా అబద్దాలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారే కానీ మనకు ఏదో చేస్తారని నమ్మవద్దని ఆయన హితవు పలికారు. ఆనాడు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదోడికి అన్యాయం చేశారని, కొంతమంది పేర్లతో బిల్లులు కాజేశారని, మరికొంత మందికి తెలియకుండానే ఇండ్లు మంజూరీ చేసి బిల్లులు స్వాహ చేశారని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇందరమ్మ పథకంలో పెద్ద అవినీతి జరిగింది మంథని నియోజకవర్గంలోనే అని తేలిందన్నారు. ఈ క్రమంలో ఆ అవినీతికి కడిగేయడానికి తొమ్మిదేండ్లు పట్టిందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి పకడ్బందీగా అమలు చేసేలా గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం అందించే బాధ్యత తనదేనని, ఎలాంటి అనుమానలు పెట్టుకోవద్దని ఆయన అన్నారు. ప్రతిపేదోడికి సొంతిల్లు ఉండాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పాన్ని నెరవేర్చుతామని, తానే స్వయంగా మీ ఇంటికి వచ్చి సంప్రదాయబద్దంగా గృహప్రవేశం చేయిస్తానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ బిడ్డల భవిష్యత్‌ బాధ్యత తీసుకుంటానని, ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూపాయి ఖర్చు లేకుండా చదివించే బాధ్యత తనదేనని అన్నారు. అంతేకాకుండా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు సైతం తానే చేయిస్తానని, గతంలో మంథనిలో సామూహిక వివాహాలు జరిపించినట్లుగానే ఈసారి కాటారం కేంద్రంగా జరిపిస్తామని, మరోసారి మంథనిలో జరిపిస్తామని ఆయన స్పష్టంచేశారు. ఓటు వేసే ముందు గొప్పగా ఆలోచన చేయాలని, ఆనాడు ధనవంతులకు, భూములు ఉన్నోళ్లకు, పన్నులు కట్టెటోళ్లకు. చదుకున్నోళ్లకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలని చూశారని, కానీ బారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మన భవిష్యత్‌ గురించి గొప్పగా ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారని అన్నారు. అలాంటి ఓటును మన కోసం పనిచేసే మన ఆకలి తీర్చే నాయకుడిని ఎన్నుకోవడంలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈనాడు మనం ఓట్లు వేసి గెలిపించినోళ్లు ఏ సమస్య చెప్పినా మా ప్రభుత్వం లేదని చెబుతూనే ప్రభుత్వం అందించే పథకాలను పంపిణీ చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఓటు మన తలరాత మార్చుతుందని, మన ఆకలి తీరుస్తుందని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు. తాను ఏనాడు ఓట్ల కోసం ఆరాటపడలేదని, ఈ ప్రాంత ప్రజలతో తనకు ఉన్నది ఓటు బంధం కాదని పేగు బంధమేనని ఆయన స్పష్టం చేశారు. మీలాంటి వాళ్లు అందుకున్న సేవలు మళ్లీ అందాలంటే నాలాంటి నాయకుడితోనే సాధ్యమనే సందేశాన్ని ప్రతి ఒక్కరు అందించాలని, మీకు మరోసారి సేవ చేసే అదృష్టాన్ని కల్పించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!