మానవత్వం చాటుకున్న నల్ల
ఎలిగేడు,సెప్టెంబర్24(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గం ఎలిగేడ్ మండలం దూళికట్ట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబసభ్యుడు ఇరుగురాళ్ల మహేష్ గత కొన్ని రోజుల నుండి మెదడు లో రక్తం గడ్డకట్టి ఫిడ్స్ వస్తూ ప్రాణాపాయ స్థితి లో ఉన్న సమాచారం స్థానిక ఎంపిటిసి ఇరుగురాళ్ల తిరుపతి పెద్దపల్లి యంగ్ & డైనమిక్ లీడర్ నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి కి ఇవ్వగా స్పందించి అతను కరీంనగర్ లోని హరిణి హాస్పిటల్ లో వైద్యం చేపించి సుమారుగా 70,000/- రూపాయలు బిల్లు పూర్తిగా మెడికల్ ఖర్చులు నల్ల భరించి, హాస్పిటల్ సదుపాయాలు డాక్టర్ రమేష్ భరించి ఆ కుటుంబానికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు.
ఈ సందర్బంగా బాధిత కుటుంబసభ్యులు నల్ల మనోహర్ రెడ్డి కి, డాక్టర్ రమేష్ కి జీవితకాలం రుణపడి ఉంటానని తెలియజేశారు.