పారిశుధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్
సుల్తానాబాద్, సెప్టెంబర్ 23(కలం శ్రీ న్యూస్):స్థానిక 5వ వార్డ్ శివాలయం, 2వ, 4వ వార్డ్ టాంక్ రోడ్, పాత జెండా ల వద్ద పలు పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పరిశీలించి, వార్డ్ లలో చెత్తను ప్లాస్టిక్ వ్యర్ధాలను పిచ్చి మొక్కలు తొలగించాలని, పారిశుధ్యం పట్ల నిర్లక్షం వహించకుండ డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెoదకుండా తగు చర్యలు తీసుకోవాలని, మంచి నీటి పైపు లైను లీకేజీ పనులను త్వరితగిన పూర్తి చేయాలని పారిశుధ్య సిబ్బందికి తెలియజేశారు .ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ తో పాటు వార్డ్ కౌన్సిలర్ గాజుల లక్ష్మి రాయమల్లు సిబ్బంది నాగరాజు, శ్రావణ్ పాల్గొన్నారు.