సామూహిక కుంకుమార్చనలు నిర్వహించిన మహిళలు
సుల్తానాబాద్, సెప్టెంబర్ 22(కలం శ్రీ న్యూస్): గణనాథుడి కృపా కటాక్షాలు ప్రలందరిపై ఉండాలన్నారు సుల్తానాబాద్ పట్టణ గాంధీనగర్ ప్రజలు. గత 45 సంవత్సరాలు గా ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో గల గాంధీ నగర్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 5వ రోజు గణపతి మండపం వద్ద మహిళలచే సామూహిక కుంకుమార్చనలు పురోహితులు శంకర శర్మ ఆధ్వర్యంలో సహస్ర కుంకుమార్చనలు చేశారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజించారు. ఈ కార్యక్రమం వార్డు కౌన్సిలర్ అనుమాల అరుణ బాపూరావు అద్వర్యం లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో ఆదర్శ యూత్ సభ్యులు , మహిళలు గాంధీ నగర్ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.