లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 450 మంది భక్తులకు అన్నవితరణ
సుల్తానాబాద్, సెప్టెంబర్ 22(కలం శ్రీ న్యూస్):లయన్స్ క్లబ్ అఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని గణేష్ నగర్ కాలనీలో గణపతి నవరాత్రుల సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా వినాయక మండపం వద్ద భక్తి శ్రద్దలతో గణనాదుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సుమారు 450 మంది భక్తులు, ప్రజలకు గణేష్ నగర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు లయన్ మాటేటి శ్రీనివాస్, నల్ల శ్రీనివాస్ లు అన్నవితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నోముల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అదనపు కార్యదర్శి వలస నీలయ్య, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్లు మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, కోశాధికారి రాయేల్ల నవీన్, నల్ల శ్రీనివాస్, గుర్రాల శంకరయ్య, రెడ్డి సమ్మయ్య, మాజీ సర్పంచ్ మాటేటి గట్టయ్య మరియు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.