వినాయక చవితి ఉత్సవాలలో డీజేలను వాడినట్లైతే కఠిన చర్యలు తప్పవు
సుల్తానాబాద్ ఎస్సై విజేందర్
సుల్తానాబాద్, సెప్టెంబర్ 21(కలం శ్రీ న్యూస్):వినాయక చవితి ఉత్సవాల్లో డీజేలను వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుల్తానాబాద్ ఎస్సై విజేందర్ డీజే నిర్వాహకులకు హెచ్చరించారు. ఈరోజు సుల్తానాబాద్ మండలలోని డీజే నిర్వాహకులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. పోలీస్ శాఖ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాలలో డీజేలను నిషేధించడం జరిగిందని నిర్వాహకులకు ఎస్సై వివరించారు. ఎక్కడైనా డీజేలు నిర్వహించినట్లు కనిపించినట్లయితే కఠిన చర్యలతో పాటు డిజెలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ముందస్తు చర్యలలో భాగంగా డిజె నిర్వాహకులను తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.