గోపూజ నిర్వహించిన గాంధీ నగర్ గణపతి ఉత్సవ కమిటీ
సుల్తానాబాద్, సెప్టెంబర్ 21(కలం శ్రీ న్యూస్):గోమాత లో సకల దేవతలు కొలువై ఉంటాయన్నారు పురోహితులు శంకర్ శర్మ. సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పదవ వార్డు గాంధీనగర్ లో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం గోపూజ నిర్వహించారు. ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత 45 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో నాల్గవ రోజు గోపూజ నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గోమాత ఆశీస్సులు పొందారు.గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేశారు .
ఈ సందర్బంగా పూజారి శంకర శర్మ మాట్లాడుతూ హైందవ సంప్రదాయం ప్రకారం హిందువులు పూజించే 33 కోట్ల దేవత మూర్తులు గోమాతలో కొలువై ఉంటారని అన్నారు . గోమాతను పూజిస్తే దేవత లందరిని పూజించినట్లు అని , ప్రతి ఒక్కరు గోమాతను పూజించాలని అన్నారు . గోమాతకు ప్రజలు గరిక,బెల్లం , నువ్వులు , నైవేద్యంగా పెట్టారని , నూతన వస్త్రం తో గోమాతకు ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు .
ఈ కార్యక్రమం లో వార్డు కౌన్సిలర్ అనుమాల అరుణ బాపూరావు , ఆదర్శ యూత్ సభ్యులు , మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.