అవయవ దానం ఆలోచన చాలా గొప్పది
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 20 (కలం శ్రీ న్యూస్):అవయవ దానం చేయాలనే ఆలోచన కొందరికే వస్తుందని,అలాంటి ఆలోచన చాలా గొప్పదని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన చెక్క శంకరయ్య హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా ఆయన అవయవాలు దానం చేశారు. గొప్పగా ఆలోచన చేసి శంకరయ్య అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించిన పుట్ట మధూకర్ వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరు అవయవ దానం చేయాలని,అలా చేయడం ద్వారా మరో ఐదు జీవితాలకు వెలుగులు అందించిన వారమవుతామని ఆయన పేర్కొన్నారు.అనంతరం శంకరయ్య కుటుంబసభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు.