Wednesday, September 18, 2024
Homeతెలంగాణప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్

మంథని, సెప్టెంబర్ 20 (కలం శ్రీ న్యూస్):మహిళా లోకానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని డిమాండ్ తో గత దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ఉద్యమానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సారధ్యంలో దశాబ్దాల కళ నేటితో నెరవేరి మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా మంథని బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బుధవారం మంథని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మహిళా మోర్చా మంథని మండల అధ్యక్షురాలు బోసెల్లి మౌనిక, మంథని పట్టణ అధ్యక్షురాలు కన్నూరి పద్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించిన యూపీఏ ప్రభుత్వం మహిళా బిల్లు విషయంలో ముందడుగు వేయకపోవడం పై మహిళా లోకానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కి ఉన్న చిత్తశుద్ధి ఎంతుందో అర్థమైందని,నేడు చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత, ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ బిల్లుతో మహిళా సాధికారత కోసం కృషి చేసిన ఘనత కేవలం నరేంద్ర మోడీ కే దక్కిందని, బిజెపి అంటేనే దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఏకైక నీతి నిజాయితీగల పార్టీ అని మరొకసారి రుజువైందని,ఈ రిజర్వేషన్ల బిల్లు ఆమోదింప చేసుకోవడమే దీనికి నిదర్శనం అని అన్నారు.రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని మహిళా సోదరీమణులు తప్పకుండా ఆదరిస్తారని రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ పరిపాలన కేంద్రంలో మరోసారి తెలంగాణలో ఈసారి బిజెపి అదేవిధంగా మంథనిలో బిజెపి పార్టీ అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి,అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్,మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, బిజెపి ముత్తారం మండల అధ్యక్షులు పేయ్యల కుమార్, మంథని ఇంచార్జ్ తోట మధుకర్, పట్టణ ఇంచార్జ్ సబ్బని సంతోష్, బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ తొట్ల రాజు,బిజెపి సీనియర్ నాయకులు కోరబోయిన మల్లికార్జున్,చిదురాల మధుకర్ రెడ్డి,రేపాక శంకర్,సుధాకర్, రవి, బొసెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!