జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 20 (కలం శ్రీ న్యూస్):మంథని నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వం పొందిన జనసేన పార్టీ కార్యకర్తలకి మంథని నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మాయ రమేష్ చేతుల మీదుగా నాయకులకు కార్యకర్తలకు అందించడం జరిగింది.అలాగే ఈ కిట్లో సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికునికి ఐదు లక్షల ప్రమాద బీమా బాండ్,ఇవ్వడం జరిగింది.మాయ రమేష్ నాయకులతో మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్నందున పార్టీని మరింత ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఈరవేన ఓం ప్రకాష్, జనగాం పవన్,మేకల శ్రావణ్,రంజిత్, ప్రణయ్ రెడ్డి,శివ ప్రసాద్,వంశీ,అభిషేక్,తదితరులు పాల్గొన్నారు.