మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,సెప్టెంబర్ 19(కలం శ్రీ న్యూస్):మంథని మండలం చిన్న ఓదాల గ్రామానికి చెందిన చేదా గట్టయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా,జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మంగళవారం ఓదాల బిఆర్ఎస్ నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలియజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు 8 వేల రూపాయలు నగదు,50 కిలోల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఎడ్ల బాపు, కటుకు బాపు,పోయిల సుమన్, వేముల లక్ష్మణ్,గాజుల రమేష్, భాషవేణి మల్లేష్, కటుకు రాజయ్య,దాసరి రమేష్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.