Thursday, September 19, 2024
Homeతెలంగాణఅంబేద్కర్‌ను అవహేళన చేసినోళ్లు అధికారం కోసం చూస్తాండ్లు

అంబేద్కర్‌ను అవహేళన చేసినోళ్లు అధికారం కోసం చూస్తాండ్లు

అంబేద్కర్‌ను అవహేళన చేసినోళ్లు అధికారం కోసం చూస్తాండ్లు

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 17(కలం శ్రీ న్యూస్ ):బారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను చిన్నగా చూపించిన పార్టీ కాంగ్రెస్‌ అని, ఒక్క కులానికే పరిమితం చేసి అవహేళన చేసినోళ్లు ఈనాడు మళ్లీ అధికారం కోసం ఆరాటపడుతున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్ అన్నారు.ఆదివారం మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి బూడిద రాజయ్యతో పాటు నాయకులు,కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్‌ ను వీడి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌లాంటి మహనీయుడిని చిన్న కులం పేరుతో నియోజకవర్గానికి చెందిన ఒకే కుటుంబం 40ఏండ్లుగా పదవులు అనుభవిస్తున్నారని,ఈ ప్రాంతంలోని బీసీలు,ఎస్సీలు, రెడ్డీలు మనల్నీదూరం పెట్టలేదని, ఒకే కుటుంబం మనల్ని దూరం పెట్టి అధికారం చేపట్టుతున్నారని ఆయన వివరించారు. ఈనాడు ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైఖ్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నక్రమంలో ఆనాటి పోరాటంలో పాల్లొన్న వారి పేర్లను ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో ఒక్క కాంగ్రెస్‌ నాయకుడి పేరు లేదన్నారు. చరిత్ర లేనివాళ్లు, మనల్ని అంటరానివాళ్లుగా చూపించిన వాళ్లకు ఓట్లు వేసి గెలిపించుకుంటున్నామని, ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేసి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని, ఇందులోబాగంగా ఎస్సీ సామాజిక వర్గాలకు ఆర్థిక చేయూతనందించేలా దళితబంధును ప్రవేశపెట్టిందని, ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఎస్సీ సామాజికవర్గమంతా బీఆర్‌ఎస్‌పార్టీలోకి చేరుతుంటే కాంగ్రెస్‌ పాలకులు ఆగమైతాండ్లని, ముఖ్యంగా మంథనిలో కాంగ్రెస్‌ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ రాద్దాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. అనేక ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దళితులకు సబ్సీడీ రుణాలు కావాలంటే అనేక షరతులు విధించేవారని, అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగితిరిగి బేజారు అయ్యారే తప్ప ఎవరికి రుణాలు రాలేదన్నారు. కానీ ఈనాడు ఎలాంటి షరతులు లేకుండా దళితబంధు పథకం అమలు చేస్తున్నారని, ఇలాంటి పథకం అమలుచేస్తుండటంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఎస్సీ సామాజిక వర్గాల్లో నమ్మకం పెరిగిందని, వారిలో చైతన్యం వచ్చి ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. 40ఏండ్లు ఆలోచన చేయకుండా ఓట్లు వేస్తే కనీసం మన గురించి ఆలోచన చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. దళిత బంధు ఇస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారని, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలకు భూములు ఇచ్చామని, రుణాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. ఆనాడు భూములు ఇచ్చి ఉంటే ఈనాడు భూముల కోసం ఎందుకు అడుగుతారని, రుణాలు ఇస్తే ఏ ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో పైసలు జమ అయ్యేవి కదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం కాగితాలకే పథకాలను పరిమితం చేసి సంబరపడ మన్నారే కానీ ఏ ఒక్కరికి పథకాల ద్వారా లబ్ది జరుగలేదన్నారు. ప్రజలు ఆలోచన చేయడంలేదని, ఏ మాట ఇచ్చిన మర్చిపోతారని గ్రహించిన కాంగ్రెస్‌ పాలకులు పథకాల పేరుతో మోసం చేస్తూనే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. కానీ ఈనాడు బీఆర్‌ఎస్‌ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రతి పథకం పకడ్బందీగా అమలుచేస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయన్నారు. ఇందిరమ్మపథకం ద్వారా అనేక మందికి ఇండ్లు మంజూరీ చేశామని చెబుతున్న కాంగ్రెస్‌ నాయకులు లబ్దిదారుల పేరున జేబులు నింపుకున్నారని, ఏ పేదవాడు ఇళ్లు నిర్మించుకోకపోయినా బిల్లులుమాత్రం కాజేశారని ఆయన అన్నారు. మనం ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదని, ప్రభుత్వం ఏదైనా అభివృధ్ది పనికి నిధులుమంజూరీ చేస్తే నేనే తెచ్చామని గొప్ప చెప్పుకుంటున్నారని, ఏదైనా పని కావాలంటే మాత్రం మా ప్రభుత్వం లేదని దాటవేస్తున్నాడని ఆయన విమర్శించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఇచ్చిన ఓటును వినియోగించుకునే ముందు ఆలోచన చేయాలని, మన కోసం ఆలోచన చేసే నాయకుడికి అధికారం ఇవ్వాలే కానీ మాయమాటలకు మోసపోయి బాధపడవద్దని ఆయన ఈ సందర్బంగా సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!