Friday, September 20, 2024
Homeతెలంగాణఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం వేడుకలు

ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం వేడుకలు

ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం వేడుకలు

సుల్తానాబాద్, సెప్టెంబర్ 17(కలం శ్రీ న్యూస్):తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ బుర్ర మౌనిక శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండా ఎగురవేసి సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్ర మౌనిక మాట్లాడుతూ తెలంగాణ భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాడి అమరులైన మహానుభావుల త్యాగ ఫలితంగా నేడు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటున్నామని, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు అందించిన అమరులను స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అన్నేడి మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వలస నీలయ్య, పొన్నం చంద్రయ్య గౌడ్, ఒజ్జ సంపత్, గరిగంటి కుమార్ బాబు, బోయిని ముత్యాలు, ఎండి సర్వర్, వడ్కాపురం ఆంజనేయులు, కల్లేపల్లి రజని, మార్కెట్ గ్రేడ్-3 కార్యదర్శి సయ్యద్ హమీద్, సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!