Saturday, July 27, 2024
Homeతెలంగాణఎరుకల ఏకలవ్య సంఘంపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు

ఎరుకల ఏకలవ్య సంఘంపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు

ఎరుకల ఏకలవ్య సంఘంపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు

ఎరుకల ఏకలవ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కుర లింగయ్య

మంథని,సెప్టెంబర్‌ 16 (కలం శ్రీ న్యూస్): ఎరుకల ఏకలవ్య సంఘంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఎరుకల ఏకలవ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కుర లింగయ్య హెచ్చరించారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా ఎరుకల ఏకలవ్య సంఘం 1999లో స్థాపించామని ఇందులో మంథని, కమాన్‌పూర్‌,ముత్తారం,మల్హర్‌, కాటారం మండలాలకు చెందిన 405 మంది సభ్యులున్నారన్నారు. మా సంఘం అభివృద్ధి కోసం మంథని మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్‌ 314లో ప్రభుత్వం మాకు భూమి కేటాయించిందన్నారు. ప్రభుత్వం మాకు ఈ భూమి అప్పగించిన సమయంలో ఈ భూమి ఎంతో లోతులో ఉండేదని, అలాంటి భూమిని మా సంఘం సభ్యులమంతా సొంత ఖర్చులతో మట్టి, మొరం పోయించి అభివృద్ధి చేసుకున్నామన్నారు. మా సంఘానికి చెందిన సభ్యులు ఇక్కడ ఇల్లులు కట్టుకొవడంతో పాటు జీవనాధారమైన పందుల షెడ్లను ఏర్పాటు చేసుకోని జీవనోపాధి పొంద జరుగుతుందన్నారు. మా సంఘం సభ్యులమంతా ఎంతో కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నామన్నారు. సంఘం అభివృద్ధి కోసం ప్రతీ రెండు నెలలకోసారి సభ్యులమంతా 12వ తేదీన సమావేశం నిర్వహించుకొని చర్చించుకోవడం జరుగుతుందన్నారు. అలాంటి మా సంఘంపై రామగిరి మండలం జల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జగన్నాథుల హరీష్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.మా సంఘంలోకి సభ్యులను చేర్చుకోవడం లేదని, సంఘానికి కేటాయించిన భూమిని సొంతానికి వాడుకుంటున్నామని చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.మా సంఘంతో ఎలాంటి సంబంధం లేకుండా, కనీసం సభ్యత్వం కూడా లేని హరీష్‌ ఆరోపణలు చేయడం సరికాదన్నారు.మరోసారి మా సంఘంపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే కుల పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి కానీ ఇలా పేపర్లలో తప్పుడు ప్రచారాలు చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కమాన్‌పూర్‌, ముత్తారం,మల్హర్‌,కాటారం మండలాల అధ్యక్షులు సారయ్య, రాజయ్య,ఉండాటి రాజేశం, సాయిలు,రాజయ్య,సమ్మయ్య, రాకేష్‌,జగన్నాథుల సదిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!