గ్రామ పంచాయతీకి స్వచ్ఛ సర్వేక్షన్ అభినందనీయం
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
సుల్తానాబాద్,సెప్టెంబర్15(కలం శ్రీ న్యూస్):గ్రామ పంచాయతీలు స్వచ్ఛ సర్వేక్షన్ కు ఎంపిక అయ్యేవిధంగా సేవలు అందించి పంచాయతీలకు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును తీసుకురావడం అభినందనీయమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గర్రెపల్లి సర్పంచ్ వీరగోని సుజాత రమేష్ గౌడ్ పెద్దపల్లి ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలవగా సర్పంచ్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు గ్రామాలలో తమ సేవలను అందించి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గ్రామాలను పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా గర్రెపల్లి గ్రామం స్వచ్ఛ సర్వేక్షన్ కు రాష్ట్ర స్థాయిలో ఎంపిక అయి అవార్డు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ను అభినందిస్తూ ముందు ముందు గ్రామంలో మరిన్ని సేవలు అందించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనవేణి మధు, పంచాయతీ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.