తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆర్ల నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నిక
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 15(కలం శ్రీ న్యూస్ ):తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది,అంబేద్కర్ వాది అయిన ఆర్ల నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు అవిలయ్య తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్ల నాగరాజుకు, అంబేద్కర్ వాది,దళిత మేధావి,జే.బీ. రాజు చేతుల మీదుగా పదవి స్వీకరణ పత్రము అందజేశారు.రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయని,ఇంకా కుల వివక్ష కొనసాగుతుందని వారు తెలిపారు. కుల నిర్మూలనకు, దళిత సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు.దళితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటాలు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిలు మహేందర్,రాకేష్,కోశాధికారి ప్రవీణ్ పాల్గొన్నారు.