Saturday, July 27, 2024
Homeతెలంగాణనాగారం జిపికి రాష్ట్రస్థాయి అవార్డు     

నాగారం జిపికి రాష్ట్రస్థాయి అవార్డు     

నాగారం జిపికి రాష్ట్రస్థాయి అవార్డు                         పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సర్పంచ్ బూడిద మల్లేష్       

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 14 (కలం శ్రీ న్యూస్): స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ – 2023 లో పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామపంచాయతీ రెండు వేల జనాభా కలిగిన కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో అవార్డు సొంతం చేసుకుంది. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని టీఎస్ఐఆర్డి లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా చేతులమీదుగా నాగారం గ్రామ సర్పంచ్ బూడిద మల్లేష్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు గ్రహీత జీపీలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 10 లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నుండి విడుదల చేస్తామని మంత్రి దయాకర్ రావు ప్రకటించారు. నాగారం గ్రామపంచాయతీని జాతీయ అవార్డు సాదించేందుకు పోటి కొరకు ప్రతిపాదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగారం సర్పంచ్ ని,పంచాయతీ కార్యదర్శిని శాలువా మెమెంటో తో మంత్రి సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బూడిద మల్లేష్ మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీకి రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని,జాతీయ స్థాయిలో సైతం తప్పకుండా అవార్డు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి అవార్డు సాధించినందుకు అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్,డీపీఓ చంద్రమౌళి, మంథని ఎంపీడీవో రమేష్,ఎంపీఓ ఆరిఫ్,ఎస్బీఎం కన్సల్టెంట్ లు రాఘవులు,రేణుక తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!