Thursday, October 10, 2024
Homeతెలంగాణఇంటికో ఉద్యోగం అంటే నీ కుటుంబం మొత్తం ఉద్యోగాలు ఇవ్వడమా కెసిఆర్....?

ఇంటికో ఉద్యోగం అంటే నీ కుటుంబం మొత్తం ఉద్యోగాలు ఇవ్వడమా కెసిఆర్….?

ఇంటికో ఉద్యోగం అంటే నీ కుటుంబం మొత్తం ఉద్యోగాలు ఇవ్వడమా కెసిఆర్….?

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 14 (కలం శ్రీ న్యూస్):బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులకు మద్దతుగా చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి నిరసిస్తూ పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలో మండల శాఖ,పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కెసిఆర్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని,3016 నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్న, ఎటువంటి చలనం లేదు కెసిఆర్ కుటుంబంలో హరీష్ రావు, కేటీఆర్,సంతోష్ రావు కు ఉద్యోగాలు ఇచ్చాడు,ఎంపీగా ఓడిపోయిన బిడ్డ కవితకు ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చావు, మరి మా కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం వద్ద? పేద మధ్యతరగతి తల్లిదండ్రులు వాళ్ల పిల్లల కొరకు అప్పులు చేసి మరి ప్రైవేటు కోచింగ్ సెంటర్లో చదివిపిస్తుంటే ,9 సంవత్సరాలు గడిచిన నోటిఫికేషన్లు వేయక ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు,వారికి కారణం నువ్వు కాదా కెసిఆర్.తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అని, ప్రజలందరిని మోసం చేసి న్యాయం చేయమని అడిగితే బిజెపి పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందుతున్నావు, మా మంథని ప్రాంతంలో ఇద్దరు నాయకులు ఒకరు ఎమ్మెల్యే, ఒకరు జడ్పీ చైర్మన్ ఉండి కూడా స్థానిక యువతకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా,ఒక పెద్ద కాలేజ్ కూడా తీసుకురాని అసమర్థులను ఎందుకు గెలిపించామని ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాంఅని ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఈ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని బిజెపి పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు,యువ నాయకులు, వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!