పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని,సెప్టెంబర్ 14( కలం శ్రీ న్యూస్): పార్లమెంటు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ బిసి బిల్లు ప్రవేశపెట్టాలని పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గోటికారి కిషన్ జి గురువారం ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటి బీసీ ప్రధాని అయిన నరేంద్ర మోడీ బీసీ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నట్లు కనిపిస్తుందని, మండల్ కమిషన్ సర్వే ఆధారంగా కాకుండా ప్రస్తుతం బీసీ జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే చట్టసభల్లో అవకాశం కల్పించినట్లు అవుతుందని,వచ్చే పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్,రామగిరి మండల అధ్యక్షుడు బండారి సదానందం, ముత్తారం మండల అధ్యక్షుడు అల్లం కుమార్ స్వామి, కమాన్ పూర్ మండల అధ్యక్షుడు గుంజపడుగు రవి ,తదితరులు పాల్గొన్నారు.