పకడ్బందీగా ఓటు నమోదు కార్యక్రమం జరగాలి
ఆర్డిఓ హనుమా నాయక్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 14 (కలం శ్రీ న్యూస్): ఓటు నమోదు కార్యక్రమం పకడ్బందీగా జరగాలని మంథని డివిజన్ తహసిల్దార్లను ఆర్డిఓ హనుమా నాయక్ ఆదేశించారు.గురువారం మంథని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డిఓ హనుమా నాయక్ అధ్యక్షతన తహసిల్దారులతో ఓటర్ జాబితా గురించి ముఖ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ నమోదు ప్రక్రియకు ఈ నెల 19 చివరి తేదీ అని,అర్హులైన అందరికీ ఓటు నమోదు ప్రక్రియలో అవకాశం కల్పించాలని,నమోదైన ఓటర్లలో దివ్యాంగులను, వయోవృద్ధులను ప్రత్యేకంగా గుర్తించాలని సూచించారు. రెవెన్యూ సిబ్బంది,బూత్ లెవల్ అధికారులతో సమన్వయం అవుతూ ఓటర్ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు తెలియజేశారు.అవసరమైతే ఓటు హక్కు గురించి అవగాహన కార్యక్రమాలు గ్రామాల్లో ఏర్పాటు చేసి,ఓటు నమోదు ప్రక్రియలో ఓటర్ల శాతం పెరిగేలా చర్యలను తక్షణమే చేపట్టాలని ఆయన వివరించారు. ఓటు నమోదు ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా,జాగ్రత్తగా ప్రజలకు అందుబాటులో ఉంటూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మార్వో రాజయ్య, డివిజన్ ఎమ్మార్వోలు పాల్గొన్నారు.