వినాయక చవితి పండగ ఏర్పాట్ల గురించి ఆర్డీవో సమీక్ష సమావేశము
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 14 (కలం శ్రీ న్యూస్):మంథని ఆర్డీవో హనుమానాయక్ తేది: 18.09.2023 రోజున జరగబోయే వినాయక చవితి పండుగ ను పురస్కరించుకొని గురువారం అన్ని శాఖల డివిజనల్ అధికారులతో /పీస్ కమిటి సభ్యులు సమీక్ష సమావేశము నిర్వహించినారు.ఈ సంధర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భముగా మట్టి విగ్రహాలు ప్రతిష్టించి పర్యావరణము రక్షించవలసిందిగా కోరారు. సమావేశమునకు హాజరైన పోలీస్,రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ, ఇరిగేషన్,రోడ్లు, భవనములు గ్రామీణ నీటి సరఫరా శాఖ,ఆరోగ్య శాఖ,ఎంపీడీవో లు, సింగరేణి అధికారులు,ఎండోమెంట్ శాఖ,ఫైర్ డిపార్ట్మెంట్ మరియు మత్స్య శాఖ అధికారులకు తగు సూచనలు చేసినారు.మండపాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి,కరెంట్ పొందుటకు పర్మిషన్ తీసుకోవాలి, డీజే లు వాడుట నిషేధం,మండపాల దగ్గర కమిటి సభ్యులు 24 గ.లు కాపలా ఉంచాలి,పరిశుభ్రత పాటించాలి,ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ మండపాల నిర్వహణ కమిటిసభ్యులు సహకరించాలని అన్నారు.