భూ సేకరణ ప్రాథమిక విచారణ పూర్తి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని, సెప్టెంబర్ 13( కలం శ్రీ న్యూస్): కాలేశ్వరం బ్యాక్ వాటర్ ప్రాజెక్టు భూసేకరణ ప్రాథమిక విచారణ బుధవారం పూర్తయింది. మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో సర్పంచ్ పుట్ట వెంకటమ్మ రామయ్య ఆధ్వర్యంలో కాలేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల ముంపుకు గురయ్యే భూసేకరణ సంబంధించిన ప్రాథమిక విచారణ సంబంధిత అధికారులు చేపట్టారు. కాలేశ్వరం బ్యాక్ వాటర్ 119 మీటర్ లెవల్ వద్ద గ్రామంలో 36 ఎకరాలు భూ సేకరణ జరుగుతుందని అధికారులు వివరించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే అర్జీ చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు భూసేకరణలో అభ్యంతరాలు ఉన్నట్టు పేర్కొంటూ అధికారులకు దరఖాస్తు చేశారు. గ్రామంలోని మరికొంతమంది రైతులు భూసేకరణ సరిగ్గా జరగలేదని సంబంధిత అధికారులు రీ సర్వే చేయాలని రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులకు గ్రామ రైతులు, సర్పంచ్ పుట్ట వెంకటమ్మ రామయ్య అధ్యక్షతన వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు రైతులు పెట్టుకున్నటువంటి దరఖాస్తుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డిటి లక్ష్మి, ఆర్ ఐ త్రివేణి, ఇరిగేషన్ అధికారులు, రెవిన్యూ సిబ్బంది కుమార్, గ్రామ కారోబార్ శ్రీధర్, మల్టీ పర్పస్ వర్కర్ అరెల్లి రిషి కుమార్, విఆర్ఏ సుమన్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.